సరైన పత్రాలు లేని 74 మోటార్‌సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తొలి శుభోదయం ప్రకాశం:-
శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు ఆధ్వర్యంలో మార్కాపురం సీఐ సుబ్బారావు సబ్ డివిజన్ ల పరిధిలో ఎస్సైలు మరియు సిబ్బంది కలిసి గురువారం కలిసి మార్కాపూర్ పట్టణంలోని ఎస్టేట్ కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి,సరైన పత్రాలు లేని 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాలు సేవించవద్దని, తద్వారా వాటి వల్ల కలిగే అనర్థాలను మరియు చట్టాల గురించి ప్రజలకు తెలియజేసి వారితో ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా కనిగిరి డిఎస్పి పి.సాయి ఈశ్వర యశ్వంత్ ఆధ్వర్యంలో కనిగిరి సీఐ యు.శ్రీనివాసులు, పామూరు సిఐ ఎం.శ్రీనివాసరావు కనిగిరి సబ్ డివిజన్ ల పరిధిలో ఎస్సైలు మరియు సిబ్బంది కలిసి కనిగిరి టౌన్ లో తెల్లవారుజామున మంగళిమాన్యం కాశి రెడ్డి కాలనీ, బృందావన్ కాలనీ రాజీవ్ కాలనీ మరియు బీసీ కాలనీ ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 50 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చెక్‌పోస్ట్ నుంచి పామూరు బస్టాండ్ వరకు “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో అధికారులు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి, పామూరు బస్టాండ్‌లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించవద్దని, వాటి వల్ల కలిగే అనర్థాలు మరియు వర్తించే చట్టాల గురించి యువత, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించి, వారితో ప్రతిజ్ఞ చేయించడమైనది.నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీసు శాఖ నిర్వహించే కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజలు వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు. వారి ప్రాంతంలో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్ధానిక పోలీసులకు లేదా డయల్ 112/100 కు తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ ల ఎస్సైలు మాధవరావు, సైదు బాబు, అంకమ్మరావు, సాంబశివరావు, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు.
