తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో జిల్లాలో ఆయా ప్రాంతాల్లోని అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లు, గ్రామ శివారులు, ముఖ్య కూడళ్లు, పలు దుకాణాలు తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో క్షుణ్ణమైన తనిఖీలు చేపట్టారు. నేరాల నివారణ, అక్రమ కార్యకలాపాలపై ముందస్తు నియంత్రణ చర్యలలో భాగంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.ప్రజల భద్రతే పరమావధిగా, నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ తరహా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని, తమ పరిసరాల్లో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఏదైనా తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 / 100కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే శాశ్వత శాంతి, భద్రత సాధ్యమని ఈ సందర్భంగా తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *