తొలి శుభోదయం:-
‘దిత్వా’ తుఫాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు భారత్ సాయం అందిస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య భారత ప్రజలు, PM మోదీ, కేంద్ర మంత్రి జై శంకరు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘క్లిష్ట సమయంలో SLకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఆర్థిక సంక్షోభ సమయంలో ఆదుకున్నట్లుగానే ఇప్పుడూ మద్దతునిస్తున్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు