తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
వలేటివారిపాలెం మండలం కూనిపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి అమ్మవారికి నిర్వహించిన పొంగళ్ళ ఉత్సవాల్లో పాల్గొన్నాను. గ్రామస్తుల ఆహ్వానం మేరకు హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.గ్రామస్తులందరూ భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో ఈ తిరునాళ్లను నిర్వహించుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా గ్రామస్తులు చూపిన ఆత్మీయతకు, చేసిన ఘన సత్కారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.పూజా కార్యక్రమాల అనంతరం స్థానిక ప్రజలతో కలిసి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, ఇతర సమస్యల గురించి చర్చించాను. మన నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుంది.