తొలి శుభోదయం కందుకూరు:-
శ్రీ అంకమ్మ తల్లి దేవాలయ రూముల నిర్మాణంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కృషి మరువలేనిదని ఆలయ పునర్నిర్మాణ నిర్మాణ కమిటీ సభ్యులు కొడాలి కోటేశ్వరరావు, మంచిరాజు వెంకట మురళీమోహన్ అన్నారు.కందుకూరు గ్రామ దేవత భక్తుల పాలిట కొంగుబంగారమైన శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణం అత్యంత సుందరంగా మనోహరంగా ఆధ్యాత్మికత తో భక్తుల హృదయాలను తాకే విధంగా రూపుదిద్దుకుంది. అంతేకాకుండా శ్రీ అంకమ్మ తల్లి దేవాలయానికి అనుబంధంగా అనివేటి మండప నిర్మాణ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. దాతల సహకారంతో పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీ అంకమ్మ తల్లి దేవాలయానికి శాశ్వత ఆదాయం సమకూర్చే విధంగా రూముల నిర్మాణానికి బహిరంగ వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే రూముల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్నాయి. ఈ రూముల నిర్మాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అందించిన సహాయ సహకారాలు మరువలేమని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు కొడాలి కోటేశ్వరరావు, మంచిరాజు వెంకట మురళీమోహన్ లు అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వగృహంలో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. మొదటి నెల 18 రూముల అద్దె 2,03,500 రూపాయల ఆదాయం జమ అయినట్లు పునర్నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ అంకమ్మ తల్లి దేవాలయ కార్య నిర్వహణ అధికారి కార్తీక్ తదితరులు ఉన్నారు.