తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం :-

బుచ్చిరెడ్డిపాళెం పట్టణ శివార్లలోని దుర్గా నగర్‌లో వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరియు నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఆలయ కమిటీలో సేవ చేసే అవకాశం లభించడం పూర్వజన్మ పూర్వజన్ సుకృతం అని తెలియజేస్తున్నాను ఆలయ నిర్వహణను సంప్రదాయాలకు మరియు ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచిస్తున్నాను. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పాటుపడాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మండల తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు దుర్గా నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *