తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషి చేసి ప్రత్యేక గుర్తింపు పొందిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని జిల్లా ఎస్పీ గారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంజీవయ్య గారి చిత్రపటానికి జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14వ తేదీన కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని పెద్దపాడులో జన్మించారని, చిన్ననాటి నుంచే ప్రతిభ కనబరిచిన ఆయన చదువులోనే కాకుండా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనూ విశేషంగా రాణించారన్నారు. రాష్ట్ర మంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా సేవలు అందించారని కొనియాడారు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని పొందిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వితంతువులు, వృద్ధులకు పింఛన్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టడం, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం లక్ష్యంగా ఏసీబీ వ్యవస్థను దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ లో స్థాపించారన్నారు. వ్యవసాయాధారిత రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గాజులదిన్నె, వరదరాజులు, పులిచింతల, వంశధార వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పట్ల ఆయన చూపిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయమని, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *