తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

మార్కాపురం జిల్లా రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి దేవాలయాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ గారితో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డిగారు సందర్శించారు. ఏప్రిల్ 2 నుండి 5 వరకు ఈ బ్రహ్మోత్సవాలు పూజా కార్యక్రమాలు, కళ్యాణం, తెప్పోత్సవం, రథోత్సవం, సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలు, ప్రవేశ మార్గాలు, రథం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, బందోబస్తు మరియు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను సమీక్షించారు. పోలీస్ అధికారులతో పాటు ఆలయ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, శ్రీ నెమలి గుండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదనంగా ప్రత్యేక రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు కల్పించామని చెప్పారు. భక్తులు పోలీస్ వారికి సహకరించి, వారి సూచనలను పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. రథోత్సవం సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అదనంగా ప్రత్యేక రెస్పాన్స్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది విధుల్లో అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
అనంతరం జిల్లా ఎస్ప ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బిసిఐ దేవ ప్రభాకర్, గిద్దలూరు రామకోటయ్య, కంభం సీఐ మల్లికార్జున, రాచర్ల ఎస్సై పి కోటేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *