వెంకటనారాయణ బజార్ లో అమరజీవి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే
తొలి శుభోదయం కందుకూరు :-
శ్రీ పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా, సోమవారం కందుకూరు లోని వెంకటనారాయణ బజార్ లో ఆయన విగ్రహానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కూటమి పార్టీల నేతలు సహా ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న లక్ష్యంతో, శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. అప్పట్లో మద్రాస్ రాష్ట్రంలో, తెలుగువారిని అనేక రకాలుగా అవమానించడాన్ని ఆయన తట్టుకోలేకపోయారని చెప్పారు. పొట్టి శ్రీరాములు త్యాగం మనందరిలో స్ఫూర్తి నింపాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు ప్రాణం త్యాగం చేసిన రోజును, ఆత్మార్పణ దినంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రస్తుత మహోన్నత రాజధాని అమరావతిలో కూడా అతిపెద్ద పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మురారి శెట్టి వెంకట సుబ్బారావు కొత్తూరు వెంకట సుధాకర్, కాకుమాని ప్రవీణ్, మురారిశెట్టి శ్రీకాంత్, మోదడుగు వెంకటేశ్వర్లు, కొత్త వెంకటేశ్వర్లు, ఇమ్మడిశెట్టి సుబ్బరాయుడు, ఇన్నమూరి నరసింహాం, గుర్రం అల్లూరయ్య, చీదెళ్ల వేణు, పబ్బిశెట్టి రాజా, సిరి శివ, వేముల శ్రీనివాసులు అప్పల మధు ఇసుకల మధు ఇస్కాల మురళి, మద్దాలి నాగరాజు, కనకర్లపూడి అవినాష్, పాదర్తి నారాయణ మురారిశెట్టి వెంకటేష్, బిజెపి నాయకులు ఘట్టమనేని హరిబాబు, వరప్రసాద్, పార్టీ నాయకులు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, పిడికిటి వెంకటేశ్వర్లు, ఉన్నం వీరాస్వామి, ఉప్పుటూరి శ్రీను, బెజవాడ ప్రసాద్, ముచ్చు శ్రీనివాసులు, షేక్ రూబీ, గడ్డం మాలకొండయ్య, ముచ్చు వేణు, భవనాసి వెంకటేశ్వర్లు గుమ్మా శివ, మచ్చ మనోహర్ పట్టణంలోని వార్డు అధ్యక్షులు, ఆర్యవైశ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
