భోగ భాగ్యాలనిచ్చే భోగి పండుగను, సరదాలు తెచ్చే సంక్రాంతిని మరియు కమ్మని కనుమ పండుగలను బంధు మిత్రులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ శ్రీ తూమాటి మాధవ రావు గారు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే, భోగి మంటలు వేసే సమయంలో మరియు చిన్న పిల్లలు గాలిపటాలు ఎగరవేసే సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ శ్రీ తూమాటి మాధవ రావు గారు ఆకాంక్షించారు.