తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మలంపాడు గ్రామంలో జరుగుతున్న తిరునాళ్ల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ తిరునాళ్ల ప్రాంగణాన్ని సందర్శించి బందోబస్త్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఈ తనిఖీలో సంతనూతలపాడు సీఐ, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొని భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. తిరునాళ్లలో పాల్గొనే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా కార్యక్రమాలను వీక్షించేలా పోలీస్ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.అదేవిధంగా, ప్రభల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించి, తిరునాళ్ల నిర్వహణలో పాటించాల్సిన భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి అంశాలపై సూచనలు అందించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా పని చేస్తోందని అధికారులు తెలిపారు.భక్తులు పోలీస్ సూచనలు పాటిస్తూ సహకరించాలని, శాంతియుత వాతావరణంలో తిరునాళ్లు విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ భాగస్వాములు కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *