తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరు పట్టణం గుర్రం వారి పాలెం లోని శ్రీ సంస్కృతి స్కూల్ లో శుక్రవారం వసంత పంచమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో, విద్యార్థులను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఒక పండుగలా కాకుండా విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపే ఒక విద్యా ఉత్సవం లా నిర్వహించారు. నూతనంగా పాఠశాలలో చేరడానికి వచ్చిన చిన్నారులకు పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారుల చేత బియ్యం పోసిన పళ్లెంలో ఓం నమః శివాయ,సిద్దం నమః అని అక్షరాలు దిద్దించి సరస్వతి దేవి సాక్షిగా విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు చదువు ఒక్కటే మనిషిని సంపూర్ణంగా మారుస్తుందని అటువంటి విద్యా ప్రమాణాన్ని ఇంత గొప్పగా ప్రారంభించడం మా అదృష్టమని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఛైర్మన్ కొంకా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ విద్య అనేది మనిషికి మూడవ కన్ను వంటిది. అటువంటి విద్యను ప్రారంభించే పవిత్ర ఘట్టమే అక్షరాభ్యాసమనీ,బిడ్డ చేత బియ్యం పై అక్షరాలు రాయించడం వెనుక ఒక గొప్ప అర్థం ఉందని, బియ్యం మనకు ఆహారాన్ని ఇస్తాయి, అలాగే విద్య మనకు జీవన ఆధారాన్ని ఇస్తుందనీ,కాబట్టి ఈ రోజు అక్షరమాల నేర్చుకుంటున్న ఈ చిన్నారులు, రేపటి రోజు ప్రపంచానికి సందేశం కావాలనీ,చదువుతో పాటు సంస్కారాన్ని, విజ్ఞానంతో పాటు వినయాన్ని అలవరుచుకొని, తల్లిదండ్రులకు మరియు ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ…విద్యార్థులకు తల్లిదండ్రులకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరి, వైస్ ప్రిన్సిపాల్ శోభారాణి, అకడమిక్ కో ఆర్డినేటర్ శకుంతల మరియుఉపాధ్యాయులు పాల్గొని చిన్నారులకు తల్లిదండ్రులు కు శుభాకాంక్షలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *