తొలి శుభోదయం ప్రకాశం:-
కనిగిరి గ్రామానికి చెందిన 26’సంవత్సరాల గల ఒక వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా తేది:06-12.2025 ఉదయం సుమారు 09:00 గంటలకు ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశంతో మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గరలో గల ఫ్లై ఓవర్ పైనుండి కిందకు దూకుటకు ప్రయత్నించగా ఆ మార్గంవైపు పోతున్న ఒక వ్యక్తి డయల్ 112 కు కాల్ చేయగా, వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ సిబ్బంది తగిన సమాచారమును సంబంధింత అధికారులకు తెలియపరిచారు. వెంటనే సంబంధించిన మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సుబ్బారావు మరియు మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై అంకమ్మ రావు తన సిబ్బందితో వ్యక్తి ఉన్నఫ్లైఓవర్ వద్దకు చేరుకొని అతని ప్రాణాలను కాపాడడం జరిగింది. ఆ తర్వాత అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి, మానసికంగా ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు.వెంటనే స్పందించి సదరు వ్యక్తి యొక్క ప్రాణాలను చాకచక్యంతో కాపాడిన పోలీసులకు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన మార్కాపురం ఇన్స్పెక్టర్ సుబ్బారావు, మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ SI అంకమ్మరావు మరియు వారి సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ .వి .హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్. అభినందించారు.