తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సదరన్ సీ ఫుడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ లో, శ్రింప్ సినర్జీ ప్రాజెక్ట్ ద్వారా సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ సేవా ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు సిపిఆర్ శిక్షణ మరియు అసంఘటిత కార్మిక చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “స్పృహలో ఉన్నవారికి లేదా శ్వాస తీసుకుంటున్న వారికి సిపిఆర్ చేయకూడదు. మనిషి నుండి ఎటువంటి స్పందన లేనప్పుడు మాత్రమే సిపిఆర్ చేయాలి” అని తెలిపారు. అనంతరం బొమ్మపై సిపిఆర్ పద్ధతిని మహిళా కార్మికులకు ప్రాక్టికల్‌గా చూపించారు.న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “అసంఘటిత కార్మికుల హక్కులు తెలుసుకోవడం ప్రతి కార్మికుడి బాధ్యత. కనీస వేతనాలు, పనిగంటలు, మహిళలకు జీతముతో కూడిన ప్రసూతి సెలవులు, ఉద్యోగ భద్రత, మరియు అన్యాయంగా ఉద్యోగం కోల్పోతే న్యాయం పొందే మార్గాలు” గురించి వివరించారు. అలాగే, “పిల్లల భద్రత తల్లిదండ్రుల ప్రాధాన్యతగా ఉండాలి” అని సూచించారు.కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ రాష్ట్ర కమ్యూనిటీ కోఆర్డినేటర్ వెంకట్, సార్డ్స్ స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ వికాస్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ మధు, మరియు సదరన్ సీ ఫుడ్స్ ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు.
