తొలి శుభోదయం కందుకూరు:-
ఫిబ్రవరి 12వ తేదీ జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కందుకూరు పట్టణంలో సిపిఐ, ఏఐటీయూసీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ నాయకులు కే వీరారెడ్డి, బి సురేష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలన ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ రంగాలను ప్రైవేటుపరం చేస్తూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఫిబ్రవరి 12వ తేదీ దేశభక్తి సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని కావున ప్రజలందరూ ఈ యొక్క సమ్మెకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి అధ్యక్షా కార్యదర్శులు కే మురళి, వై ఆనంద్ మోహన్, మాట్లాడుతూ 12వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యు మాధవరావు, కే రామమూర్తి, హరిబాబు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కే రమణమ్మ, పులి నాగేశ్వరరావు, సేలం వెంకటలక్ష్మి, ప్రకాష్, రమేష్, పెయింట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జె రవి తదితరులు పాల్గొన్నారు.