తొలి శుభోదయం ప్రకాశం :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలులో సాగర్ కవచం-2025 కార్యక్రమం నేపథ్యంలో సమగ్ర భద్రతా చర్యలను పరిశీలించడానికి ప్రత్యేక బందోబస్తు బ్రీఫింగ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ సిబ్బందికి బీచ్ ప్రాంతాలు, జలాశయాలు మరియు ముఖ్య ప్రాంతాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలు, విజిబుల్ పోలీసింగ్, పహారా విధులు, రెస్క్యూ ఏర్పాట్లు వంటి అంశాలపై పూర్తి వివరాలతో సూచనలు అందించారు.బ్రీఫింగ్ కార్యక్రమంలో ఒంగోలు టూ టౌన్ సీఐ గారు, మెరైన్ సీఐ , కొత్తపట్నం ఎస్సై పాల్గొని, తమ పరిధిలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను వివరించారు. ప్రజల ప్రాణ భద్రతే తమ ప్రాధాన్యమని అధికారులు స్పష్టం చేశారు.అధికారులు మాట్లాడుతూ, సాగర్ కవచం సందర్భంగా భారీ జనసందోహం ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, లైఫ్‌గార్డ్ టీమ్‌లు, రెస్క్యూ బోట్లు, చెకింగ్ పాయింట్లు వంటి ఏర్పాట్లు చేపట్టారని తెలిపారు. ప్రజలు భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని కోరారు.