కూటమి 18 నెలల పాలనలోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
తొలి శుభోదయం సింగరాయకొండ:-
కూటమి 18 నెలల పాలనలోనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డిఎస్ బీవీ స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి,మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య రూ. 30 లక్షలతో నిర్మించిన పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ భవనం, రూ. 40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించారు. అనంతరం మరో రూ. 30 లక్షల విలువైన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ… గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి శూన్యం. కూటమి 18 నెలల పాలనలోనే గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణం, ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రజలు కూటమి సుస్థిర పాలన కోరుకుంటున్నారని
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.