తొలి శుభోదయం సింగరాయకొండ: –
సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రాణాపాయానికి దారితీస్తోంది. సింగరాయకొండలో గాలిపటం ఎగరవేసే సమయంలో ఉపయోగించిన దారం వ్యక్తి మెడకు తగిలి తీవ్ర రక్తస్రావ గాయం కలిగింది. ప్రమాదానికి గురైన వ్యక్తిని కుటుంబ సభ్యులు వెంటనే ఒంగోలు రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నైలాన్ దారం, మంజా వంటి ప్రమాదకరమైన దారాలు పిల్లలకే కాకుండా వాహనదారులు, పాదచారులకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలిపటాలు ఎగరవేసే సమయంలో పిల్లలను నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతాయని వారు తెలిపారు. పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని, ప్రమాదకరమైన దారాలను వినియోగించకుండా ఉండాలని, రద్దీ ప్రాంతాలకు దూరంగా గాలిపటాలు ఎగరవేయాలని అధికారులు సూచించారు.