తొలి శుభోదయం సింగరాయకొండ:-
ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు మరియు సింగరాయకొండ సీఐ గారు సింగరాయకొండ ప్రభుత్వ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక పటాకుల విక్రయ స్థలాన్ని పరిశీలించారు.ఈ పరిశీలనలో భద్రతా మార్గదర్శకాలు, అగ్ని నియమాలు, నిల్వ విధానాలు కచ్చితంగా అమలులో ఉన్నాయా అని తనిఖీ చేశారు. ప్రజల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు.ప్రజలకు విజ్ఞప్తి – తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పటాకులు వినియోగించడం ప్రమాదకరమని, భద్రతా మార్గదర్శకాల కచ్చితమైన అమలు కోసం పోలీసులకు సహకరించాలని సూచిస్తున్నారు.