తొలి శుభోదయం సింగరాయకొండ:-
ఒంగోలులోని కలెక్టరేట్‌లో జరిగిన DRC మీటింగ్ సందర్భంగా సింగరాయకొండ మండలం, సింగరాయకొండ గ్రామ వాసులు 2014 నుండి నిలిచిపోయిన ఇనాం భూములు మరియు బైరాగిమాన్యం రిజిస్ట్రేషన్ తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు జిల్లా ఇంచార్జీ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి కి, అలాగే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కి వినతి పత్రం సమర్పించారు.సదరు సమస్యపై ఇద్దరు మంత్రులు సానుకూలంగా స్పందించి, భూముల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కూనపరెడ్డి సుబ్బారావు, కొల్ల శ్రీను, శ్రీ రంగనాయకులు, విజయ్ కుమార్, షేక్ యాస్థాని, షేక్ బాబు, ఎం. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.