తొలి శుభోదయం ప్రకాశం:-

పాఠశాలలో అసెస్మెంట్ బుక్ లెట్స్ నీ మరియు ఇతర పుస్తకాలను సర్దుబాటు చేసుకోవడానికి ఉపాధ్యాయులకు వీలుగా ఉండటం కోసం గాను దాతలు బైరపునేని మోహన్ రావు, PACS చైర్మన్ అండ్ AMC డైరెక్టర్ ఒక రాక్ ను అలాగే కీర్తి శేషులైన ఉపాధ్యాయులు బెల్లం వీరనారాయణ గారి జ్ఞాపకార్థం వారి సతీమణి, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు పసుపులేటి కోటేశ్వరి రెండు రాక్ లను శుక్రవారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో పాఠశాలకు బహుకరించారు.
పాఠశాలకు ఎంతో అవసరమైన రాకులను బహూకరించినందుకు దాతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే మహాలక్ష్మి గారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ మలినేని గోపీచంద్ మాజీ ఎంపీటీసీ పారా రామకోటయ్య శ్రీ షేక్ యాసిన్ పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కే మహాలక్ష్మి మరియు పాఠశాల సిబ్బంది, CRMT శ్రీ కే.వంశి మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *