తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రభుత్వం ఇచ్చిన మెనూ తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు .ఇండేల.లక్ష్మీ రెడ్డి చెప్పారు. మంగళవారం సింగరాయకొండ లోని డా” డా.బి.అర్.అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయం లో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన మెనూ అసలు పాటించటం లేదని . వారి సొంత తీర్మానంతో వారికి నచ్చిన విధంగా మెనూ పెడుతున్నారన్నారు. కమిషన్ సభ్యులు ఎందుకు ప్రభుత్వం ఇచ్చే మెనూ ఎందుకు పిల్లలకు పెట్టదంలేదని ప్రశ్నించగా,పొంతనలేని సమాధానాలు చెప్తూ,పిల్లలతో ఏర్పాటు చేసిన కమిటీ ఆమోదంతో మెనూ ను మార్చామని వారు చెప్పటం తో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.పిల్లలకి సరిపడా కూరలు ఉండకపోవటం గమనించిన కమిషన్ సభ్యులు పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రూమ్ సందర్శించగా పాడైన వేరు శనగ పప్పులు గమనించి ఇవి ఎందుకు వాడుతున్నారన్నారు. సాయి లోహిత ఏజెన్సీ వారికి వెంటనే ఫోన్ చేసి ఇలాంటి వేరుశనగ పప్పు ఎందుకు పంపించారని ,ఇవి తింటే పిల్లలు అనారోగ్యానికి గురి అవుతారని వెంటనే వాటిని మార్చాలని ఆయన ఆదేశించారు. ఈ విషయం గురించి ప్రిన్సిపాల్ ను అడగగా నాకు ఏం తెలియదని మొత్తం ఈ నెల స్టార్ చూసుకునే మేడమ్ కి తెలుస్తుందన్నారు.ఈ విషయాన్ని సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.800 మంది విద్యార్థులు ఉన్నా ఇక్కడ ఇలాంటి ఫుడ్ పెట్టడమేంటన్నారు. ఇంచార్జి జిల్లా గురుకుల కోఆర్డినేటర్ అరుణ కి ఆయన కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి వివరించారు. స్టాక్ రిజిస్టర్ ను కూడా సరిగా మెయింటైన్ చేయలేదన్నారు.ఇక్కడ గమనించిన పరిస్థితి మీద తీవ్ర అసంతృప్తిగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, డి.ఎస్.వో పద్మ శ్రీ, డి.ఎం.సివిల్ సప్లైస్ వరలక్ష్మి , సమగ్ర శిక్ష జిల్లా బాలిక సంరక్షణ అధికారి హేమలత తదితర అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *