తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,జిల్లా పోలీసుల విధి నిర్వహణను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి పనితీరు, స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు మరియు స్థానిక నేరాల పరిస్థితిపై సమీక్ష చేపట్టారు.సిబ్బందికి ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, స్టేషన్ పనితీరును పారదర్శకంగా కొనసాగించడం, పహారా విధులను సమర్థవంతంగా నిర్వహించడం, శాంతి భద్రత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తగిన సూచనలు అందించారు. ప్రజా భద్రత కోసం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఐ తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *