తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుకూరు రోడ్ వద్ద ప్రకాశం పోలీసులు గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు స్థానిక ప్రజలకు గంజాయి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చట్టపరమైన శిక్షలు మరియు కుటుంబాలపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు.యువతను నేరమార్గం వైపు నెట్టే గంజాయి వంటి మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని, సమాజంలో అలాంటి అక్రమ కార్యకలాపాలను గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా పోస్టర్లు ప్రదర్శించడం, పాంప్లెట్‌ల పంపిణీ చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీసులు కోరారు.