తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, యువతను నేరాల బారిన పడకుండా కాపాడటం, చట్టాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు విద్యార్థులకు
మాదకద్రవ్యాల (గంజాయి, డ్రగ్స్) దుష్ప్రభావాలు
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు
మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం
నేరాలకు దూరంగా ఉండాల్సిన అవసరం

వంటి అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు.యువత చిన్న వయస్సులో తీసుకునే తప్పు నిర్ణయాలు వారి భవిష్యత్తును నాశనం చేయవచ్చని, మంచి లక్ష్యంతో చదువుపై దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. సోషల్ మీడియా దుర్వినియోగం, అపరిచితులతో ఆన్‌లైన్ పరిచయాలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ, విద్యార్థులు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, డయల్ 112, సమీప పోలీస్ స్టేషన్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల భద్రత, యువత సంక్షేమం కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *