తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని రైల్వే రోడ్డులో ట్రాఫిక్ క్రమశిక్షణను మెరుగుపరచడం మరియు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా సింగరాయకొండ సీఐ గారు పోలీస్ సిబ్బందితో కలిసి విస్తృత స్థాయిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ, అనధికారిక పార్కింగ్, వన్‌వే ఉల్లంఘనలు వంటి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. అలాగే ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశమై ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం మరియు రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలపై వివరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, అనుమతించిన సంఖ్యకు మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, సరైన పార్కింగ్ పాటించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలను గౌరవిస్తూ సహకారం అందిస్తే ప్రమాదాలను నివారించవచ్చని, శాంతియుతమైన మరియు సురక్షిత రవాణా వ్యవస్థ ఏర్పడుతుందని సీఐ పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *