తొలి శుభోదయం ప్రకాశం :-
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, సింగరాయకొండ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ క్రైమ్ మీటింగ్ నిర్వహించబడింది.ఈ సమావేశానికి సింగరాయకొండ సీఐ శ్రీ హాజరత్తయ్య హాజరై, సర్కిల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు పురోగతి, మరియు నేరాల నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు.ప్రతి కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలి. నేరాలు జరగకుండా సమర్థవంతమైన విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలి. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ నేర నివారణపై దృష్టి సారించాలి” అని సూచించారు.అలాగే రోడ్డు భద్రత, మద్యం మత్తులో డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, స్టేషన్ పరిమితిలో పహారా బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.