తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బీసీ సింహ గర్జన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముఖ్య అంశం బీసీల అణిచివేతకు స్వస్థి పలికేందుకు మన అధినేత బోడె రామచంద్ర యాదవ్ అన్న బీసీ సింహ గర్జన కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ సందర్భంగా “బీసీ సింహ గర్జన” మహాసభ యొక్క ముఖ్య ఎజెండాను నాయకులు వివరించారు:
- బీసీ రక్షణ చట్టం అమలు చేయాలి
- విద్య మరియు ఉపాధిలో బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలి
- రాజకీయ స్థానాలు పెంచాలి
- సామాజిక న్యాయం, సమానత్వం సాధించాలి బీసీ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు రావాలిబీసీ సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలని, బీసీ సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచాము…ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కుమ్మర పవన్ భార్గవ్ యాదవ్, కావేటి కృష్ణ యాదవ్ , మిరియం శ్రీకాంత్ , గోకుల్ , బన్నీ , నవీన్ , వెంకటేష్ , జగదీష్ , గౌతం మరియు యువత పాల్గొనాము