తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని ఐదవ వార్డులో నిర్వహించిన సెమీ క్రిస్టమస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదర–సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టమస్ పండుగ ప్రేమ, త్యాగం, సేవా భావనకు ప్రతీక అని పేర్కొంటూ, ఆ విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,మహిళలు, యువత పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.