తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ప్రజల భద్రత, నేర నివారణే లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రోడ్ సేఫ్టీ వారియర్లు కలిసి వాహనదారులు మరియు ప్రజలకు సైబర్ మోసాలు, గంజాయి వినియోగం, హెల్మెట్ ధరించకపోవడం, అధిక వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆన్‌లైన్ మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఇతరులతో పంచుకోరాదని సూచించారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అధిక వేగంతో వాహనాలు నడపకూడదని, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని పోలీసులు తెలిపారు.ప్రజలు పోలీస్ శాఖ చేపడుతున్న ఈ అవగాహన కార్యక్రమాలకు సహకరించాలని, ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద విషయాలు గమనిస్తే వెంటనే డయల్ 112 / 100 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.