తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

‘స్కై ఐ – ప్రకాశం’ ప్రాజెక్ట్‌లో భాగంగా, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముప్పాళ్ల గ్రామ శివార్లలో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు.ఈ నిఘా కార్యక్రమాన్ని పొన్నలూరు ఎస్సై ఆధ్వర్యంలో చేపట్టి, గ్రామ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా దూర ప్రాంతాలు, పంట పొలాలు, అడవి పరిసర ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించారు.అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, నేరాలను ముందుగానే గుర్తించడం, ప్రజలకు భద్రత కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఇలాంటి సాంకేతిక నిఘా చర్యలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా కొనసాగుతాయని వెల్లడించారు.
ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి, శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పొన్నలూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *