తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, “స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్టు లో భాగంగా, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇపగుంట గ్రామంలో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు డ్రోన్ సాంకేతికత ద్వారా గ్రామంలోని ప్రధాన రహదారులు, ప్రజా ప్రదేశాలు, అనుమానాస్పద ప్రాంతాలు మరియు పరిసరాలను పరిశీలించి, శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించారు. అదేవిధంగా గ్రామస్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి గ్రామ పరిస్థితులు, ప్రజా సమస్యలు, భద్రతా అంశాలపై వివరాలు సేకరించారు.ఈ చర్య ద్వారా నేరాల నివారణ, సముదాయ పోలీసింగ్ బలోపేతం, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచడం ప్రధాన లక్ష్యంగా ఉంది. గ్రామస్థులు పోలీసుల ఈ ఆధునిక, ముందస్తు చర్యలను అభినందిస్తూ పూర్తి సహకారం అందించారు.
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆధునిక సాంకేతికతతో పాటు ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.