తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ లోని స్మార్ట్ జన్ పాఠశాల లో సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా గుజ్జల ఎలమంద రెడ్డి నగర్లో వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు సావిత్రిబాయి ఫూలే జయంతి గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ , “డాక్టర్ .N.గీతా రాణి” మాట్లాడుతూ, సావిత్రిబాయి ఫూలే గారు బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు, ఆమె మహిళల సాధికారత విప్లవాత్మకమైన అడుగు వేశారు. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళ ఉద్యమకారిణి అంతేగాక సంఘసంస్కర్త రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు అని ప్రసంగించారు.
