తొలి శుభోదయం ప్రకాశం :-
హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన జరిగే అనర్థాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు
రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్. ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ కలసి హెల్మెట్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారని, వాటి వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని, కావున ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవాలని పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి రక్షణ కవచంలా హెల్మెట్ ఉంటుందన్నారు. కావున ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనాలు నడపరాదని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్,సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదనిహెచ్చరిస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని, హెల్మెట్ ధరించటం ద్వారా మీ భద్రత మరియు మీ కుటుంబం యొక్క ఆనందం గురించి ఆలోచించాలని అధికారులు తెలియచేసారు.