తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-

బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు బాపట్ల సర్కిల్ సిఐ హరికృష్ణ గారి ఆధ్వర్యంలో చందోలు ఎన్ హెచ్216 వద్ద వాహన తనిఖీ నిర్వహించిన ఎస్సై మర్రి వెంకట శివకుమార్.
చందోలు గ్రామంలోని ఎన్ హెచ్ హైవే 216 వద్ద ఎస్సై మర్రి వెంకట శివకుమార్ వాహన తనిఖీ చేసే వాహనదారులతో మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వివరిస్తూ హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ ఈనెల 15వ తారీకు నుంచి “నో హెల్మెట్ -నో ఫ్యూయల్”అనే అంశంపై వాహనదారులకి వివరించారు . వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు సూచన చేశారు.అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, సెల్ఫోన్ డ్రైవింగ్, మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వరాదు అనే అంశాలపై వాహనదారులకి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ వారి సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *