తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

రోడ్డు ప్రమాదాల నివారణ, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం, ప్రజల ప్రాణ భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు అద్దంకి పట్టణంలో హెల్మెట్ వినియోగం మరియు మత్తు పదార్థాల (డ్రగ్స్) నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టాలపై ప్రజలకు స్పష్టంగా వివరించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడే కీలక సాధనమని పోలీసులు తెలిపారు.అదేవిధంగా, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలు, అలాగే డ్రగ్స్‌కు సంబంధించిన చట్టపరమైన శిక్షలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమాన్ని అద్దంకి సీఐ ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రజలు చురుకుగా పాల్గొని పోలీసులకు తమ సహకారం అందించారు. రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నివారణలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.ప్రజల భద్రతే లక్ష్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసు శాఖ తెలియజేసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *