తొలి శుభోదయం న్యూస్ సందుకూరు:-
పి.వి.ఆర్ అకాడమీ వారు నిర్వహించిన జిల్లా స్థాయి హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో కందుకూరుకు చెందిన నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు జిల్లాస్థాయి లో బహుమతి సాధించడం సంతోషించదగ్గ విషయమని నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ వి.షాలిని రెడ్డి ఒక ప్రకటనలో జిల్లాస్థాయి బహుమతి సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో హ్యాండ్ రైటింగ్ నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకొని రాష్ట్రస్థాయిలో అత్యున్నతమైన గౌరవాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ వి.మర్రెడ్డి కరణం శ్రీనివాసరావు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.