తొలి శుభోదయం సింగరాయకొండ:-

సింగరాయకొండ సుందర్ నగర్ కాలనీకి చెందిన రావినూతల జయ కుమార్ ను హ్యూమన్ రైట్స్ జిల్లా- సమన్వయకర్తగా నియమించినట్లుగా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. జయ కుమార్ సాంత్వనా సేవ సమితి స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా రత్న పురస్కారాన్ని అందుకున్నారు.
అంతేకాకుండా అనేక స్వచ్ఛంద సేవ సంఘాలతో వివిధ హోదాల్లో పనిచేసి సమాజానికి తన వంతు సేవలను అందిస్తున్నారు. జయ కుమార్ సమాజానికి అందిస్తున్న సేవలను ఆయనలో ఉన్న సేవ తత్పరత, అంకితభావం, సమాజం పట్ల గౌరవం, ముఖ్యంగా బాల్య వివాహాలు, బాల కార్మికులు, బాండెడ్ చైల్డ్ లేబర్, వీధి బాలలు, అరికట్టడంలో విస్తృతంగా తను చేసిన సేవలను, తదితర సద్గుణాలను గుర్తించి హ్యూమన్ రైట్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీనివాసరావు జయ కుమార్ ని జిల్లా సమన్వయకర్తగా గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హ్యూమన్ రైట్స్ అభివృద్ధికి పేద,నిరుపేదల హక్కుల సాధనకు వారి అభివృద్ధికి అభ్యున్నతికి జయ కుమార్ కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు.
కాగా తనను జిల్లా సమన్వయ కర్త గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు కి జిల్లా అధ్యక్షులు కోడూరు వెంకటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలిపారు… తనకు అప్పగించిన ఈ బాధ్యతను అంకితభావంతో,చిత్తశుద్ధితో, అమలు చేసి హ్యూమన్ రైట్స్ ఆశయాలను నెరవేరుస్తానని జయ కుమార్ తెలిపినారు.
ఈ సందర్భంగా పలువురు జయకుమార్ కి అభినందనలు తెలిపినారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *