తొలి శుభోదయం ప్రకాశం :-

ఫిర్యాది:మూడవత్ లక్ష్మా నాయక్ S/o సోంలా నాయక్, వయస్సు26 సంవత్సరాలు, పాతచేరువు తండా గ్రామం, పుల్లలచేరువు మండలం, ప్రకాశం జిల్లా.ముద్దాయిల వివరములు: A1.చొప్పరపు వేణు s/o పెరయ్య, వయస్సు 20 సం.లు, N/o గణేష్ పాలెం గ్రామం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా.
A2.చొప్పరపు సన్నీ s/o పెరయ్య, వయస్సు 25 సం.లు, N/o గణేష్ పాలెం గ్రామం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లామొత్తం 11 మోటార్ సైకిళ్ళ విలువ సుమారు Rs.10,00,000/-కేసువివరములు: ది.29.11.2025 సాయంత్రం 18.00 గంటల సమయములో ఈ కేసులో ఫిర్యాది మూడవత్ లక్ష్మా నాయక్, పాతచేరువు తండా గ్రామం, పుల్లలచెరువు మండలం, ప్రకాశం జిల్లా అను వ్యక్తి తన AP39EY3171 మోటార్ సైకిల్ ని పుల్లలచెరువు గ్రామం మరియు మండలంలోని APSRTC బస్ స్టాండ్ ఆవరణలో నిలిపి, గుంటూరు పట్టణానికి బస్ లో వెళ్ళిన సమయములో, అదే రోజు రాత్రి సదరు మోటార్ సైకిల్ ని దొంగలించినందుకు గాను ఫిర్యాది ఇచ్చిన రిపోర్ట్ మేరకు తేదీ 13.05.2025 న పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.ప్రకాశం జిల్లా ఎస్పీ V. హర్ష వర్ధన్ రాజు, ఐపీఎస్.ఆదేశాల మేరకు, మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో, యర్రగొండపాలెం సీఐ K. అజయ్ కుమార్ పర్యవేక్షణలో పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ ఎస్సై L. సంపత్ కుమార్ మరియు సిబ్బంది బృందాలుగా ఏర్పడి లోతైన దర్యాప్తు చేపట్టారు. నేరం జరిగిన తీరును విశ్లేషిస్తూ, కేసును నిరంతరం రివ్యూ చేస్తూ, నేరస్థలం మరియు పరిసరాల్లో విచారణ జరిపి, CC కెమెరా ఫూటేజ్, సాంకేతిక ఆధారాలు మరియు పలు కోణాల నుండి దర్యాప్తు కొనసాగించారు. ఈ దర్యాప్తు సమయంలో ముద్దాయిల సమాచారాన్ని సేకరించి, 03.12.2025న పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామ శివార్లలో ఉన్న శ్రీ సంతాన వేణుగోపాలస్వామి గుడి వద్ద, మధ్యవర్తుల సమక్షంలో ముద్దాయులను అదుపులోకి తీసుకున్నారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించబడిన మొత్తం 10 మోటార్ సైకిళ్ల కేసుల్లో వీరిని ముద్దాయిలుగా నిర్ధారించి అరెస్ట్ చేశారు.పల్నాడు జిల్లా, వినుకొండ మండలం, గణేశ్‌పాలెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం మరియు ఇతర జల్సాలకు అలవాటు పడడం వల్ల సంపాదన సరిపోకపోవడంతో త్వరగా డబ్బు సంపాదించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హ్యాండ్ లాక్ పెట్టని మోటార్‌సైకిళ్లను దొంగిలించి అమ్మాలని యత్నించారు. సోషల్ మీడియాలో బైక్‌ను ఎలా స్టార్ట్ చేయాలో వీడియోలు చూసి తమ బైక్‌పై ప్రయత్నించి నేర్చుకుని దొంగతనానికి సిద్ధమయ్యారు.వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో దొంగిలించబడిన బైకులు
1)పుల్లలచెరువు PS — Cr.No.86/2025 — AP39EY3171,2) యర్రగొండపాలెం PS — Cr.No.187/2025 — AP39DV6907,3) యర్రగొండపాలెం PS — Cr.No.188/2025 — AP39BA7398,4)దొనకొండ PS — Cr.No.120/2025 — AP39HG9073, 5)మార్కాపురం రూరల్ PS — Cr.No.145/2025 — AP27BR5923,6)పాత గుంటూరు PS — Cr.No.347/2025 — AP39FU5212,7)పిడుగురాళ్లలో మద్యం షాప్ వద్ద — AP07CQ8196, 8)కారంపూడి గ్రామం రెస్టారెంట్ వద్ద — AP39JX9798,9) నాగార్జునసాగర్ లాడ్జ్ ముందర — AP07CJ9083,10)నాగార్జునసాగర్ స్నానాల ఘాట్ వద్ద — Chassis No: MBLJA06ACCGJ24195,11) తెలంగాణ — హాలియా బస్టాండ్ వద్ద — TS05EU9988
మొత్తంగా పలుచోట్ల దొంగిలించబడిన 11 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన యర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ K.అజయ్ కుమార్,పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ ఎస్సై L.సంపత్ కుమార్ మరియు సిబ్బంది HC-806, S.రమేష, PC-3830,V.అరుణ్ కుమార్, PC 2382- D.వీరాoజనేయులు, PC- 2655 M.Venu, PC-2361, Ch. కాశీ బాబు మరియు HG-532, S.సత్యనారాయణ లను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *