తొలి శుభోదయం టంగుటూరు:-
2026 ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరుగుతావుంది. ఈ సందర్భంగా కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టంగుటూరు లో బైక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి , టీ. రాము, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజెస్, , iftu నాయకులు టీ. వెంకటరావు, aituc నాయకులు టీ. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని 2026 ఫిబ్రవరి 12వ తేదీ జరిగే సమ్మెలో పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు,కాంట్రాక్టు ఉద్యోగులు, ఆర్పీలు వెలుగు ఉద్యోగులు,ఫీల్డ్అసిస్టెంట్లు,ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ కార్మికులు,ముఠా కార్మికులు,ఆటో కార్మికులు,వ్యవసాయ కార్మికులు, పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన మండల కేంద్రాల్లో ప్రదర్శన, సభలు జరుగుతాయని వీటిలో ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.