తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
దక్షిణ సింహాచలం పాత సింగరాయకొండ శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో ఈ నెల 13 నుండి 23 వరకు రామానుజ చార్యుల జయంతి సందర్భంగా చిన్న తిరునాళ్ళ ఉత్సవాలు జరుగుతాయని ధార్మిక మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణ వేణి తెలిపారు. ఈ ప్రాంతం లో భక్తుల కొంగు బంగారుగా ఉన్న లక్ష్మి నారసింహ స్వామి వారి సన్నిధి లో రామానుజ చార్యుల వారి జయంతి వేడుకలు వైభవంగా నిత్య అభిషేకములు, దివ్య ప్రబంధ పారాయణ సాయింత్రం నాలాయర దివ్య ప్రబంధ పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని వారు వివరించారు. కావున భక్తులు ఈ చిన్న తిరునాళ్ళ ఉత్సవాల లో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
