తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాలమేరకు బాపట్ల డిఎస్పి జగదీష్ నాయక్ నేతృత్వంలో బాపట్ల టౌన్ సిఐ రాంబాబు ఆధ్వర్యంలో నో హెలిమెంట్ నో ఫ్యూయల్ అవేర్నెస్ కార్యక్రమం బాపట్ల పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బాపట్ల పట్టణ సీఐ రాంబాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల పై ప్రయాణించే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఈ నెల 15వ తేదీ తర్వాత హెల్మెట్ లేని వారికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయడం అనేది జరగదని చాలా క్లుప్తంగా బాపట్ల పట్టణ సిఐ రాంబాబు తెలియజేయడం జరిగింది . హెల్మెట్ ధరించని వాహనదారులకు కఠిన చర్యలు తీసుకుంటామని జరిమానా కూడా విధించడం జరుగుతుందనీ బాపట్ల పట్టణ సిఐ రాంబాబు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్ ,ఉమెన్ ఎస్సై నస్రిన్ పోలీస్ సిబ్బంది ,వాహనదారులు పాల్గొన్నారు