తొలి శుభోదయం కందుకూరు:-

37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధవారం కందుకూరు లోని NTR సర్కిల్ నందు ఆటో డ్రైవర్లు మరియు మోటార్ సైకిల్ వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జె అనిల్ కుమార్ మాట్లాడుతూ రహదారి భద్రత పట్ల ప్రతి ఒక్క వాహనదారుడు అవగాహన కలిగి ఉండి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా తల్లిదండ్రులకు మా రవాణా శాఖ తరఫున ముఖ్య విజ్ఞప్తి ఏమనగా మైనర్ బాలికలకు వాహనం ఇవ్వకుండా ఉండాలని అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే వాహనం ఇవ్వాలని కోరుచున్నామని, మైనర్లకు డ్రైవింగ్ ఇచ్చిన వాహన యజమానులు, తల్లిదండ్రులు కేసులలో భాగస్వామ్యం అవుతారని తెలిపారు. ఒకవేళ మైనర్ తెలియక ప్రమాదాలకు కారణమైతే ఇన్సూరెన్స్ రాకుండా పోతుందనే విషయాన్ని తెలియజేశారు. కుటుంబ సభ్యులు 18 సంవత్సరాల పైబడిన పిల్లలకు డ్రైవింగ్ లైసెన్సును పొందిన తరువాతనే వాహనం నడుపవలెనని తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన ఒక దురదృష్ట కారణమైన సంఘటన కందుకూరు టౌన్ కానిస్టేబుల్ డ్యూటీ లో ఉంది వాహనము మీద పోవుచుండగా మితిమీరిన వేగంతో ఇంకో వాహనం గుద్దటం వలన తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించడం జరిగినది. ఇది చాలా బాధాకరమైన సంఘటనని ఇకపై ప్రతి ఒక్కరు కూడా దయచేసి మితిమీరిన వేగంతో వాహనం నడుపు రాదని, హెల్మెట్ ధరించి వాహనం నడుపవలెనని తెలియచేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *