తొలి శుభోదయం ప్రకాశం:-

జనవరి 26న ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ బలగాలు, హోమ్ గార్డులు, ఎన్సీసీ విభాగాల నుండి మొత్తం 6 ప్లాటూన్లతో నిర్వహించిన కవాత్ రిహార్సల్స్‌ను ఆదివారం జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ కవాత్‌కు ఆర్ఐ రమణ రెడ్డి పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. రిహార్సల్స్‌లో భాగంగా ముందుగా జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి పోలీస్ బలగాల కవాత్‌ను పరిశీలించికవాత్ ను నిర్వహించడంలో కొన్ని సూచనలు, మెళుకువలు సూచించారు. ఈ వేడుకలకు అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, విద్యార్థులు హాజరు కానున్న నేపథ్యంలో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. అలాగే మంచినీటి సదుపాయం, వాహనాల పార్కింగ్, రాకపోకల నియంత్రణ వంటి అంశాలపై కూడా పలు సూచనలు తెలియజేశారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకాశం పోలీస్ పరేడ్ ద్వారా ప్రకాశం ఖ్యాతిని చాటి చెప్పాలన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో మహిళా, హోమ్ గార్డ్ మరియు NCC ప్లాటూన్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గణతంత్ర వేడుకలకు హాజరయ్యే ముఖ్యఅతిధులు, ప్రజానీకానికి దేశ ఉన్నతిని చాటేలా పోలీస్ పరేడ్ సాగాలన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు మరింత ఉత్సాహంగా కవాతు ప్రదర్శన చేయాలని సూచించారు. తీవ్రవాదులు/అతివాదులు/ముఖ్యమైన ప్రజాప్రతినిధులను మరియు విఐపిలను ఏదైన ప్రాంతంలోని రూమ్ లో బంధించినప్పుడు మన పోలీస్ స్పాట్ కమాండో లు రంగంలోకి దిగి సురక్షితంగా ప్రముఖలను ఎలా కాపాడుతారో డెమో ద్వారా ప్రదర్శించారు. రేపు ఇంకా అద్భుతంగా ప్రదర్శించాలన్నారు. ఈకార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఒంగోలు సబ్ డివిజన్ సీఐలు శ్రీకాంత్ బాబు, నాగరాజు, శ్రీనివాసరావు,విజయకృష్ణ, సోమశేఖర్, ఆర్ఐలు సీతారామిరెడ్డి, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *