తొలి శుభోదయం:-

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా & విక్రయం పై ప్రత్యేక దర్యాప్తులో భాగంగా రాబడిన సమాచారం మేరకు ఈ రోజు రైల్వే స్టేషన్ బయట పరిసర ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగినది.

ముద్దాయిల వివరాలు:

A1: ఈడిగ ఈశ్వర్ గౌడ్ @ గాలిగాడు, వయసు: 28 సంవత్సరాలు, S/o ఈడిగ చంద్రశేఖర్, నివాసం: శ్రీనివాస టాకీస్ సమీపం, కొత్త పేట, డోన్ టౌన్, నంద్యాల జిల్లా.

A2: షేక్ హస్సేన్ @ హసన్ వలి @ హసన్ బాయ్, వయసు: 27 సంవత్సరాలు, S/o షేక్ ఇస్మాయిల్ సాహెబ్, పాతపేట, డోన్ టౌన్, నంద్యాల జిల్లా.A3: చాకలి హరికృష్ణ @ గుండు, వయసు: 20 సంవత్సరాలు, S/o చాకలి వెంకటేష్, సుంకాలాఫీస్ సమీపం, కొండపేట, డోన్ టౌన్, నంద్యాల జిల్లా.పై ముగ్గురిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడికి పంపడమైనది.
వీరికి ఎక్కడ నుండి గంజాయి వచ్చింది అని పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. ఈ రైడ్ లో డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ భాష, ఎస్సై శరత్ కుమార్ రెడ్డి మరియు సిబ్బంది నాగరాజు, సీతారామయ్య, రాము పాల్గొన్నారు.అక్రమ మత్తుపదార్థాల విక్రయం, రవాణా పై డోన్ టౌన్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ, ప్రజల భద్రత కోసం నిరంతరం గస్తీ నిర్వహిస్తుమని తెలియజేస్తున్నాము.డోన్ టౌన్ పోలీస్ స్టేషన్
నంద్యాల జిల్లా

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *