తొలి శుభోదయం సింగరాయకొండ :-
ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు మత్స్య శాఖ డిపార్ట్మెంట్ నందు జిల్లా స్థాయి మల్టీస్టెక్ హోల్డర్స్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎలిజిబెత్, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ రొయ్యల ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు వారికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి, కార్మికుల కుటుంబంలోని పిల్లలు చదువుకొని మంచి స్థితిలోకి రావాలని వారు ఉన్నత చదువులు అధిరోహించాలన్నారు.శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని, కార్మికులకు అందవలసిన పథకాలు మరియు కార్మికుల యొక్క ఆరోగ్యం భద్రత గురించి ఎక్కువ చర్యలు తీసుకోవాలని అన్నారు.అసిస్టెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఎలిజబెత్ మాట్లాడుతూ కార్మికులు యొక్క పిల్లలు 18 సంవత్సరాలు దాటకుండా ఎవరిని కూడా పనికి పంపించవద్దని వారికి విద్యను అందించాలని, వాళ్ళని చైల్డ్ లేబర్ గా చేయవద్దనిఅన్నారు.అనంతరం న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులందరూ అసంఘటిత కార్మికులని వీరికి పిఎఫ్, ఈఎస్ఐ అందని పక్షంలో వెంటనే చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల దినోత్సవం కావున ప్రతి ఒక్క వర్కర్లకి తమ హక్కులనేది తప్పనిసరిగ తెలుసుకోవాలని,హక్కుల్ని ఉపయోగించుకోవాలని, సమాజం పట్ల ఎంతో బాధ్యతగా మెలగాలని, వెట్టి చాకిరి నుంచి బయట పడాలని అన్నారు.కార్యక్రమంలో మత్స్యకారుల ప్రెసిడెంట్ జక్రయ్య, తిరుపతిరావు,రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పథకాలన్నీ కూడా పొందే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.కార్యక్రమంలో మత్స్యశాఖ ఎఫ్డిఓ ఎస్కే సుభాని, మత్స్యశాఖ ఎఫ్డిఓ రవికుమార్ ఒంగోలు ఎఫ్డిఓ ఆశ,తిరుపతి రావు ఆక్వా రొయ్యల ప్రెసిడెంట్ యశ్వంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు