తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాన మేరకు,కనిగిరి డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్‌లో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించారు. రికార్డు నిర్వహణ, కేసు ఫైళ్ల అప్‌డేషన్, స్టేషన్ పనితీరులో ఉన్నత ప్రమాణాలు పాటించే విధంగా సిబ్బందికి అవసరమైన సూచనలు అందజేశారు.డీఎస్పీ స్టేషన్ సిబ్బందికి ప్రజా సేవలో మరింత జాగ్రత్త, స్పందన, క్రమశిక్షణ పాటించాలని, అలాగే అన్ని రికార్డులు సమయానుకూలంగా అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.