తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ గ్రామ పంచాయతీలో ఉపసర్పంచ్ పదవికి ఎంపికైన 7వ వార్డు సభ్యుడు ఓలేటి రవిశంకర్ రెడ్డి గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రవిశంకర్ రెడ్డి, గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి, శుద్ధి నీటి సరఫరా, కాలువల నిర్మాణం, వెలుగుల విస్తరణతో పాటు యువత అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు.
కార్యక్రమంలో పంచాయతీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.