తొలి శుభోదయం :-
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఈ పథకానికి పేరుమార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఇది “పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం” పేరుతో కొనసాగనుంది.గ్రామీణ నిరుద్యోగుల జీవనోపాధిని బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పథకంలో మరో ప్రధాన మార్పు చేసింది. ఇప్పటి వరకు 100 రోజులు ఉపాధి కల్పించిన ఈ పథకం కింద, ఇకపై సంవత్సరానికి 120 పని దినాలు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఎక్కువకాలం ఉపాధి లభించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
పథకం అమలు కోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా నిధులు కేటాయించాయి. తాజా నిర్ణయం ప్రకారం ఈ పథకానికి రూ. 1.51 లక్షల కోట్లు విడుదల చేయబడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, కార్మికులకు ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలకు ఈ నిధులు వినియోగించబోతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఈ మార్పులు గ్రామీణ కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తాయని, నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.