సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో రికార్డు స్థాయిలో 1056 కేసులు రాజీ
సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో జాతీయ మెగా లోకదాలత్ విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్.వి లీలా శ్యాం సుందరి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా
డాక్టర్. వి.లీలా శ్యాంసుందరి మాట్లాడుతూ, లోకదాలత్ ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో, వేగవంతంగా న్యాయం అందుతుందని, పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా సమాజంలో శాంతి, సౌహార్దం పెరుగుతుందని తెలిపారు.లోకదాలత్‌లో వివిధ రకాల సివిల్, క్రిమినల్ సమ్మతయోగ్య కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులు పరిష్కరించబడ్డాయి. దీని ద్వారా కోర్టులపై ఉన్న భారాన్ని తగ్గించడంలో లోకదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని న్యాయవాదులు పేర్కొన్నారు. సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ పడిన కేసు వివరాలు…
క్రిమినల్ కేసులు 185,
సివిల్ కేసులు 29,
ఎస్ టి సి, పెట్టీ కేసులు 842
మొత్తం రాజీ అయిన కేసులు 1056
రికార్డ్ స్థాయిలో కేసులు రాజీ అవడానికి సహకారం అందించిన పోలీసు సిబ్బందిని , న్యాయ వాదులని, కోర్టు సిబ్బందిని మరియు ఈ అవకాశం వినియోగించుకొన్న కక్షి దారులని మరియు న్యాయమూర్తి అభినందించారు.కార్యక్రమంలో సభాధ్యక్షులుగా సింగరాయకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నెబోయిన శ్రీనివాసులు,సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ చావా హాజరత్తయ్య,కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సోమశేఖర్ పాల్గొనగా,లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లు గా, కొల్లూరి వెంకట నరసింహారావు,బక్కమంతుల వెంకటేశ్వర్లు,వ్యవరించగ పి సంజీవ రెడ్డి పాల్గొన్నారు.లోక్ అదాలత్ లో పాల్గొన్న కక్షి దారులకు అల్పాహారం,త్రాగు నీటి వసతి ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది ,న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు శాఖ వారు,మరియు కక్షిదారులు పాల్గొన్నారు.
